వైఎస్ జగన్ మిషన్ ఇంపాజిబుల్

September 30, 2015 | 11:57 AM | 3 Views
ప్రింట్ కామెంట్
payyavula-jagan-mohan-reddy-properties-niharonline

సాధారణంగా మన నేతలు తమ తమ ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు ఎప్పుడూ సంశయిస్తు ఉంటారు. ఒక వేళ బయటపెట్టిన సరైన చిట్టాలను మాత్రం చెప్పరు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం కాస్త విరుద్ధం. దేశంలో ఏ పార్టీ అధినేత చెయ్యని పని ఆయన ఆనవాయితీగా చేస్తూ వస్తుంటారు. ప్రతీ ఏడూ తనతోపాటు భార్య, కుమారుడి ఆస్తులు సైతం వెల్లడిస్తాడు. అది కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ. ఇక ఆయన వెలువరించిన ప్రతీసారి కూడా ప్రత్యర్థులు అదంతా హుళక్కే అని వాదించటం, దానికి ఆయన మండిపడటం సర్వసాధారణం అయిపోయింది.

అయితే ఈ దఫా మాత్రం కాస్త ప్రత్యేకం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఆయన ఆస్తుల వివరాలను బయటపెట్టారు. ఇక దీనిపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఆరోపణలకు దిగింది. ముఖ్యంగా లోకేష్ పేరిట ఉన్న ఆస్తుల వివరాలను టీడీపీ కార్యకర్తలు కూడా నమ్మరని అంబటి రాంబాబు లాంటి వారు బాగా ఫైరయ్యారు. ఇప్పుడు వీటికి టీడీపీ గట్టి కౌంటరే ఇచ్చింది.

          అసలు జగన్ కి ధైర్యముంటే ఆస్తులు వెల్లడించాలని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సవాల్ చేశారు. మంగళవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియా సాక్షిగా ఆయన జగన్ పై విరుచుకుపడ్డారు. మొన్నటి ఎన్నికల సందర్భంగా జగన్ తప్పుడు ధ్రువీకరణలతో కూడిన అఫిడవిట్ ను ఎన్నికల సంఘానికి సమర్పించారని ఆరోపించారు. తన ఆస్తుల్లో కొన్నింటిని మాత్రమే ప్రకటించిన జగన్... హైదరాబాదులోని లోటస్ పాండ్ ను కాని, బెంగళూరులో 26 ఎకరాల్లో నిర్మించుకున్న భవనాన్ని కాని అందులో పేర్కొనలేదని ఆరోపించారు. ఈ విషయంపై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. చివరకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా చంద్రబాబు ఆస్తులపై కేసులు దాఖలు చేశారని, అయితే ఆ కేసుల్లో తనకు అపజయం తప్పదన్న భావనతోనే ఆయన వాటిని వెనక్కు తీసుకున్నారని పయ్యావుల చెప్పారు.

మరి జగన్ ఆరోపలన్నీ కొట్టిపడేస్తాడా? లేక ధైర్యం చేసి ముందుకు వచ్చి మీడియా ఎదుట ఆస్తులను ప్రకటిస్తాడా? కొంచెం కష్టమైన సవాల్ ను విసిరారు కేశవగారు. కనీసం స్పందిస్తాడా? చూద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ