పెను ప్రమాదం నుంచి బయటపడిన మహేష్ బావ

February 27, 2016 | 02:44 PM | 2 Views
ప్రింట్ కామెంట్
jayadev-galla-escaped-accident-niharonline

గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ కు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. శనివారం ఉదయం తన సొంత నియోజకవర్గంలోని మేడికొండూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. రూ.6 కోట్ల విలువతో ఏర్పాటు చేయనున్న రెండు వంతెనలకు శంకుస్థాపన చేశారు. దీనికి ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా హజరయ్యారు.

అనంతరం తిరుగు ప్రయాణంలో భాగంగా పేరేచెర్ల వంతెనపై వస్తున్న క్రమంలో ఆయన కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. వంతెనపై వస్తున్న ఆయన కాన్వాయ్ లోని వాహనాలు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. స్పీడుగా వెళుతున్న క్రమంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయన కాన్వాయ్ లోని ఐదు వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే గల్లా జయదేవ్ కారు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. గల్లా జయదేవ్ కు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.

54 ఏళ్ల గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీగానే కాదు సినీ నటుడు మహేష్ బాబుకు వరుసకు బావ అవుతాడనే విషయం కూడా తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ కూతురు పద్మావతిని ఈయనకిచ్చి వివాహం చేశారు. ఆయన తల్లి గల్లా అరుణకుమారి గతంలో కాంగ్రెస్ తరపున మంత్రిగా కూడా పనిచేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రిచ్చెస్ట్ ఎంపిీగా ఆయన రికార్డు సృష్టించారు కూడా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ