తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత ఎమ్మెల్యేల పరిస్థితి విడ్డూరంగా ఉంది. అసెంబ్లీ ప్రోరోగ్ అయిన తర్వాత విడుదలైన జాబితాను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే అధికారిక జాబితాలో సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంకా తెలుగుదేశం జాబితాలోనే ఉంది. మరి ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కదా. అయినప్పటికీ ఈ జాబితా ప్రకారం ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారని అర్థం. ఇది ఒక్క తలసానికే పరిమితం కాదు. తామంతా గులాబీ తీర్థం పుచ్చుకున్నామని చెప్పుకునే నేతలదంతా ఇదే పరిస్థితి. అయితే వీరందరిలో తలసానియే సంథింగ్ స్పెషల్. టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ... మరోవైపు అధికార పక్షం తరపున మంత్రిగా చెలామణి అవుతున్నారు. ఈ విషయమై ఆయనను కదిలిస్తే రాజీనామా చేశా కదా అని చెబుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాను ఎదర్కునేందకు సిద్ధంగా ఉన్నానని ధీమాగా చెబుతున్నాడు. అయితే స్పీకర్ మాత్రం ఆయనను ఇంకా టీడీపీ ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నాడు. ఇక ఇది గమనిస్తున్న సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఇదేం చోద్యమో అని అనుకుంటున్నారు.