గ్రేటర్ లో టీఆర్ఎస్ కు భారీగానే షాక్ తగిలింది

February 10, 2016 | 10:59 AM | 1 Views
ప్రింట్ కామెంట్
TRS-lost-deposit-in-15-divisions-GHMC-election-niharonline

జీహెచ్ఎంసీ ఎన్నికలు చరిత్రను తిరగరాశాయి. కనివిని ఎరుగని రీతిలో గులాబీ దళం గెలుపు సాధించింది. గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఏ పార్టీ కూడా దాదాపు మజ్లిస్ మద్దతు లేనిదే దాదాపు గ్రేటర్ మేయర్ పీఠం దక్కేది కాదు. కానీ తాజా ఎన్నికల్లో మాత్రం తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ సత్తా చాటింది. మజ్లిస్ మద్దతు లేకుండానే ఆ పార్టీ గ్రేటర్ మేయర్ పీఠాన్ని అధిరోహించనుంది. ఈ మేరకు స్పష్టమైన మెజారిటీ సాధించిన టీఆర్ఎస్, గురువారం తన అభ్యర్థిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టనుంది. అయితే ఇంతటి అఖండ విజయాన్ని సాధించినప్పటికీ అధికారపక్షానికి ఈ ఎన్నికల్లో భారీ షాకే తగిలిందట.

మొత్తం అన్ని (150) డివిజన్లలో ఆ పార్టీ పోటీ చేయగా, అత్యధికంగా 99 స్థానాల్లో విజయం సాధించింది. కానీ 15 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు అయ్యిందట. మరోవైపు ఎంపిక చేసుకున్న డివిజన్లలోనే పోటీ చేసిన మజ్లిస్ కూ 10 డివిజన్లలో డిపాజిట్లు దక్కలేదు. ఇక ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ కు ఏకంగా 126 స్థానాల్లో కనీస ఓట్లు కూడా రాలేదు. సింగిల్ సీటుతో సరిపెట్టుకున్న టీడీపీకి 36 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయని గణాంకాలు వివరించాయి. అయితే ఉన్నంతలో మాత్రం కాస్త కూస్తో కూటమి మూలంగా పోటీ పెట్టకుండా బీజేపీ పరువు నిలుపుకుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ