నారాయణఖేడ్ జనాలకు హరీష్ దత్తత గాలం

February 09, 2016 | 05:48 PM | 2 Views
ప్రింట్ కామెంట్
harishrao-narayanakhed-adoption-niharonline

నారాయణఖేడ్ ఉపఎన్నికల కోసం కొన్నిరోజులుగా టీఆర్ఎస్ తరపున ఒంటరి ప్రచారం చేస్తున్న మంత్రి హరీశ్ రావు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అధికార పక్షం అయిన తాము తప్పకుండా గెలుస్తామని స్పష్టం చేశారు. ప్రజల స్పందనను బట్టే తానిలా చెబుతున్నానన్నారు. వరంగల్ ఎన్నికలోగా భారీ మెజారీటీ వస్తుందనుకుంటున్నానని చెప్పారు. నారాయణఖేడ్ లో ప్రచారంలో భాగంగా నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో హరీశ్ మాట్లాడారు.

                ఇక గెలుపు కోసం ఆయన కొత్త మంత్రం పటించారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే ఖేడ్ ను తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఇక ప్రతిపక్షాలకు ఈ ఎన్నికలో డిపాజిట్లైనా దక్కుతాయా లేదా అనేది తెలియాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రచారం చేసి వెళ్లిపోతారని, కానీ అభివృద్ధి చేసేది తామేనని తేల్చి చెప్పారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారని, ఇకిప్పుడేం చేస్తారని వ్యాఖ్యానించారు. ఏ ఎన్నికలైన ఇకపై టీఆర్ఎస్ గెలుపు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ