రాజకీయ నాయకుల వ్యవహారశైలి ఎలా ఉన్నా... వారి వ్యక్తిగత విషయాలను బజారుకీడ్చి రచ్చ రచ్చ చెయ్యటం కామన్. పాయింట్ దొరికిందంటే చాలు పీలక పట్టుకుని లాగి వివాదాలు చెయ్యటం ప్రతిపక్షాలకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా తెలంగాణకు చెందిన ఓ మంత్రి వ్యక్తిగత విషయమంటూ రచ్చ జరుగుతుంది. అయితే ఇలాంటి విమర్శలు వచ్చిన టైంలో ఆరోపణలంటూ కొట్టేయటం కూడా కామనే. కానీ, ఈ నేత మాత్రం సంథింగ్ స్పెషల్ అంటున్నాడు. పేకాట ఆడుతూ కాలం గడుపుతాన్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి సమాధానమిచ్చుకున్నాడు.
‘ఇది చాలా తప్పుడు ఆలోచన. మేం పుట్టి పెరిగినటువంటి వాతావరణం, మా కుటుంబ నేపథ్యం, మా సంప్రదాయం, మా కుండే సర్కిల్ వాటన్నింటిల్లో మాకుండే ప్రైవేటు జీవితంలో ఇలాంటివి అదనపు క్వాలిఫికేషన్. బహిరంగంగానో, ప్రజలకు నష్టం కలిగేలానో, ఇబ్బంది కలిగేలాగానో రమణ అనే వ్యక్తి ఏ కార్యక్రమాలూ చేయరు. ఎప్పుడూ చేయలేదు కూడా. ప్రజాజీవితంలోకి వచ్చిన తరువాత ప్రైవేటు లైఫ్ లు ఉంటాయంటారా? అని ప్రశ్నించగా, "మా కుటుంబ నేపథ్యం, కుటుంబంతోనే సరదాగా ఉండటం, వాళ్లతో ఆమాత్రం కాలక్షేపం చేయనీయకుండా... ఆరోపణలేంటి?" అని ప్రశ్నించారు. ఇటీవల కేరళలో మీరు పేకాట ఆడి రూ. 70 లక్షలు గెలుచుకున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజమా? అబద్ధమా? అని ప్రశ్నించగా, "అన్నీ తప్పుడు ఆలోచనలతో చేస్తున్న విమర్శలే. కేరళ వెళ్లింది లేదు, ఆడింది లేదు" అన్నారు. పేకాటలో మీరు అంత మంచి ప్లేయరా? అని అడుగగా, "చిన్నప్పటి నుంచి జగిత్యాల క్లబ్ మెంబర్ని, హైదరాబాద్ లో కూడా క్లబ్ మెంబర్ గా ఉన్నాము. సరదాగా ఫ్రెండ్స్ తో గడుపుతాను. దాన్ని రాజకీయాలకు వర్తించడం బాధాకరమైన అంశం. పార్టీ ప్రశ్నించే విధంగా ఎప్పుడూ ప్రయత్నించ లేదు" అన్నారు. సొంత పార్టీయే పట్టించుకోవట్లేదట మరి ప్రత్యర్థుల్లారా మీకు అవసరమా చెప్పండి అధ్యక్షా!