అధికార పక్షమైన తెలంగాణ రాష్ర్ట సమితి మరియు ప్రతిపక్షమైన కాంగ్రేస్ ల మధ్య మాటల గారడి జరుగుతున్నది. పై రెండు అధికార పార్టీల కీలక నేతలు రంగంలోకి దిగారు.
అసలు విషయమేంటంటే...వరంగల్ లోక్ సభకు జరగనున్న ఉప ఎన్నికల దరిమిలా ఈ పార్టీల కీలక నేతలు యుద్దరంగంలోకి దూసుకువచ్చారు.
సోమవారం నాడు ఆదిలాబాదులోని దిలావర్ పూర్ లో వాటర్ గ్రిడ్ పైలాన్ ను ఆవిష్కరించిన అనంతరం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రేస్ నేతలపై మాటల తూటాలు పేల్చారు.
కేటీఆర్ మాట్లాడుతూ, తమపై అవినీతి ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకకోవడానికి సిద్దమని ప్రకటించారు.
తన ఘాటు వ్యాఖ్యలతో టీడీపీ, కాంగ్రేస్ ప్రభుత్వాల్లో కీలక మంత్రి పదవులు నిర్వహించినప్పటికీ, గ్రిడ్ కు డీపీఆర్ ఉందా అంటూ ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమని కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) వ్యాఖ్యానించారు.
మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకునే పద్దతిని బట్టి ఉంటుంది. కాంగ్రేస్ నాయకులు మర్యాద ఇస్తే.. మేము కూడా తిరిగ ిమర్యాద ఇస్తాం అని మరియు సామెత రూపంగా వారు తమలపాకులతో కొడితే, మేము తలుపు చెక్కతో కొట్టేందుకు సిద్దంగా ఉన్నామని కేటీఆర్ హెచ్చరించారు.