ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి ఇప్పుడు అందరి ద్రుష్టిని ఆకర్షిస్తున్నాడు. బలరాం బారి (59) ఢిల్లీలోని ఛాందినీ చౌక్ లోని రోడ్డుపక్కన ఓ చిన్న టీ దుకాణం నడుపుకునే వ్యక్తి. లోక్ సభ , మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటివరకు 19 సార్లు పోటీచేశాడు. ఈసారి కూడా అసెంబ్లీ బరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా తన అద్రుష్టాన్ని పరిక్షించుకోనున్నాడు. నామినేషన్ వేసేందుకు కూడా ఈసారి నాదగ్గర డబ్బుల్లేవ్, అయిన నా భార్య, బంధువుల నుంచి డబ్బుతీసుకున్నానని తెలిపాడు. నమ్మకమే పెట్టుబడిగా పెట్టి గెలుపుకోసం ట్రైచేస్తున్నాడట. అంతేకాదు ప్రధాని మోదీ కూడా ఒకప్పుడు ఛాయ్ వాలానే. ఆయన స్పూర్తితోనే తాను పోటీ చేశానని ఆయన చెప్పారు.