హామీలపై ప్రశ్నిస్తే... ఆ ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా మాట్లాడాడట

February 07, 2015 | 11:10 AM | 29 Views
ప్రింట్ కామెంట్
kalvakuntla_vidyasagar_rao_chat_in_whatsapp_niharonline

ప్రజల సమస్యలు తీర్చాల్సిన ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా మాట్లాడితే. ఇప్పుడున్న కాలంలో ఎవరు ఊరుకోవట్లేదు లేండి. వారికి ఎలా సమాధానం చెప్పాలో జనాలకు బాగా తెలుసు. కరీంనగర్ జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని కోనరావుపేట గ్రామంలో ఎన్నికల సందర్భంగా సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తానని ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు హామీనిచ్చారట. దీనికి సంబంధించి ఇంతవరకు ఏ అధికారి పట్టించుకోకపోవటంతో విసిగిన ఓ రైతు నేరుగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకే ఫోన్ చేసి అడిగాడట. తాను తిరుపతిలో ఉన్నానని, ఊరికే ఫోన్ చేసి విసిగించొద్దని ఎమ్మెల్యే రైతుపై కసురుకున్నాడని సమాచారం. దీనికి రైతు తాము ఓట్లేసి గెలిపించింది ఇందుకేనా అడి ప్రశ్నించడంతో కంగుతిన్న ఎమ్మెల్యే ‘వేసినవ్ లే... రూపాయి తీసుకోకుండా ఓటేసినవా?. ఫోన్ పెట్టేయ్’ అంటూ ఆగ్రహాం వెల్లగక్కాడట. దీంతో అవాక్కయిన రైతు ఆ సంభాషణను వాట్సప్ లో అప్ లోడ్ చేశాడు. ఇప్పుడది హాట్ టాపిక్ గా మారింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ