తెలంగాణలో తారక రామ రాజ్యం

August 22, 2015 | 03:01 PM | 4 Views
ప్రింట్ కామెంట్
kcr_ktr_interaction_with_villagers_in_gramjyothi_niharonline

గ్రామజ్యోతి పథకం పురస్కరించుకుని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి తారకరామారావు నెల్వలపల్లి గ్రామంలో బైఠాయించి ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం ఏవిధమైన భేషజం లేకుండా చేశారు. నీ ఇంటి సమస్య తీరుస్తా బువ్వపెట్టవా మరి అని ఆడబిడ్డల మనసు గెలుచుకునేలా ప్రవర్తించేరు. ముఖ్యమంత్రి మనవడు తినే బియ్యం వంటిదే హాస్టలు పిల్లలు తినే ఏర్పాటు చేస్తున్నామని పెద్దమనసు చాటుకున్నారు. ఇటువంటి పర్యటనలతో మంత్రితోబాటు ప్రభుత్వం పైన కూడా ప్రజల్లో భరోసా పెరుగుతుంది. వచ్చినవాడు ముఖ్యమంత్రి కొడుకు.

                     ఎన్టీఆర్ మీద ప్రేమ కొద్దీ కేసీఆర్ తన కొడుక్కి పెట్టుకన్న పేరు అది. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకునే వ్యవధి దొరికి ముచ్చటిస్తే అదే పది వేలు. రాజకీయ నాయకుడి మీద చెలామణిలో ఉన్న అపప్రథలన్నీ ఒక్కసారిగా మాయం కాకపోయినా సుహృద్భావ వాతావరణానికి పునాది పడి ప్రజలు నిశ్చితంగా బ్రతికే రోజులు మొదలవ్వగలవు. అవును కదా రామయ తండ్రీ... ఓ రామయ తండ్రీ! తండ్రి కేసీఆర్ కూడా గ్రామాల్లో తిరుగుతూ పెద్దా లేదు చిన్నా లేదు అందరం ఒక్కటే అంటూ తట్టా బుట్టా, పలుగు పారా పట్టుకుని తనూ ఒక చెయ్యి వేసి ఆచరణలో చూపిస్తున్నారు. ఎవరేం అనుకున్నా తండ్రీ కొడుకుల శ్రమ ఫలిస్తుందని ఆశ!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ