పవన్ కళ్యాణ్ మంచి నటుడు. యనమల ఒక మంచి వకీలు. అడపాతడపా ఏదో మాట్లాడటం నటునికి కుదిరినట్టు వకీలు పొలిటీషియని కి కుదరదు. రాజధాని కోసం బలవంతపు భూసేకరణ వద్దని పవన్ చెప్తున్నాడు. ఆయన ఎవరికీ జవాబుదారి కాదని దేశం తమ్ముళ్ల పచ్చాపచ్చాని అభిప్రాయం. రామకృష్ణుడు అన్ని రకాల ఒత్తిళ్లు, అందరి విమర్శలు అనుభవిస్తూ తామేదీ త్రిశంకు స్వర్గం కట్టడం లేదని అనగానే ట్వీటు కళ్యాణ్ ముందు కట్టేది స్వర్గమని తెలిస్తే త్రిశంకా, రెగ్గులరా అనిన్నీ, హైదరాబాదులో సినీ పరిశ్రమకి ఇచ్చినవి కొండలే తప్ప సాగునేల కాదనీ, తనకైతే హైదరాబాద్ కొండల్లో గానీ, వైజాగు కొండల్లో గానీ స్టూడియోలు లేవనీ వెల్లడించేడు. ఇందులో అర్థం చేస్కునేందుకు కొంచెం శ్రమపడేలా ఉక్రోషపూరితంగా ఉంది కదూ. ఆఫీసూ, ఇల్లూ కట్టుకునేందుకు పవన్ జూబ్లీ హిల్స్ లో స్థలాలు కొని కట్టుకోవడం పెండింగులో పెట్టుకున్నాడు తీరిక లేక అని అభిజ్నావర్గాల భోగట్టా. ఈ పితలాటకం లేకుండా ఏంచేస్తే బావుంటుందో చెప్పవయ్యా మహానుభావా. ఏం చెయ్యొద్దో కాదు బాబూ అని దేశం నాయకులు నెత్తికొట్టుకుంటున్నారు. అవును అసలే బిక్కుబిక్కు మంటూ దిక్కులేకుండా ఉన్న రాష్ట్రం మీద ఇంకో రాయి వెయ్యడం ఎందుకు?