మాలేత ప్రభుత్వం, మానూనూగు ప్రభుత్వం, బుజ్జి ప్రభుత్వం గద్దెనెక్కి సంవత్సరంబావు కాలం కూడా గతించలేదు. సభను సాగనివ్వకుండ యాగీ చేస్తున్న ప్రతిపక్షాలకు సోయి లేకుండపాయె అని ముఖ్యమైన మంత్రిగారు దుఃఖపడడం జరిగింది. ప్రతిపక్షి ఒకరు సినిమా చూపిస్తా మామా అన్నట్టు మాట్లాడడంతో సారుగారికి బాగామండి యావత్తు ప్రతిపక్షాన్ని బయటికి పొమన్నారు.
పోనీ నాన్నగారు గెంటేసేరుగాని వాళ్లుంటే ఆమజాయే వేరని ఆయన ఉత్తమాభిరుచిని చాటుకున్నారు కేటిఆర్. అల్లుడు వరుసైన హరీష్ రావు వీళ్లకు తగిన శాస్తి జరగవలసిందే అన్నట్టుగా బంగారు తెలంగాణకు ఎవరు ఎదురొచ్చినా అంతేమరి అని ప్రకటించారు.
ఇదేదో రాజ్యాంగ ప్రహసనంగా అందరూ భావిస్తున్నారు. కానీ గతంలో దొరవారు అభిప్రాయపడినట్టుగా ప్రతిపక్షం సుద్ద దండగ, ఆ పాత్ర కూడా మనమే పోషించడం ప్రాక్టీసు చేద్దాం. అందుకే ప్రతిపక్షాన్ని మనం గెంటేసినట్టుగాక, వారంతట వారే మమ్మల్ని గెంటేయండి మహాప్రభో.. అని బతిమాలిన విధంగా పిక్చర్ ఇద్దాం. దాంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు సూత్రం సెక్సస్ అవుద్ది అని అమలు చేశారు. స్వపక్షం వారు సభలో ప్రభుత్వ వైఫల్యాలను ఈ సందర్భంగా ఎండగట్టడం జరిగింది. ఇకపై ప్రతిపక్షాల ఉనికి డౌటే మరి!