ముందు కూతురిది... ఆ తర్వాతే కేసీఆర్ పెళ్లట!

October 08, 2015 | 05:55 PM | 1 Views
ప్రింట్ కామెంట్
revanth-reddy-kcr-after-daughter-marriage-niharonline

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కి డెడ్ లైన్ ప్రకటించేశారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఇక ఓపిక పట్టే చాన్సే లేదంటూ తేల్చేశాడు. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట గురువారం టీడీపీ, బీజేపీలు మహాధర్నా నిర్వహించాయి. ఈ ధర్నాలో రేవంత్ మాట్లాడుతూ...  కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తోందని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ విధానాల వల్లే ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్ తో కలసి ముందుకు సాగుతున్నామని చెప్పారు.

‘మీకు ముఖ్యమంత్రి ఉంటే, మాకు ప్రధానమంత్రి ఉన్నారని టీఆర్ఎస్ శ్రేణులను హెచ్చరించారు. డిసెంబర్ లో తన కూతురి పెళ్లి చేస్తానని... ఆ తర్వాత కేసీఆర్ పెళ్లి చేస్తానని’ రేవంత్ హెచ్చరించారు.  ఈ కార్యక్రమానికి టీటీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, మండవ వెంకటేశ్వరరావు, బీజేపీ నేతలు డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు. కుమార్తె వివాహం తర్వాత ఫ్రీ టైం దొరకటంతోపాటు అధికార పక్షానికి ముచ్చెమటలు పోయించెందుకు రేవంత్ ప్రణాళికతో ఉన్నట్లు తెలుస్తోంది. సో... అప్పటిదాకా రిలాక్స్ గా ఉండమని పరోక్షంగా టీ సీఎంను హెచ్చరిస్తున్నారన్నమాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ