చంద్రబాబు సంక్రాంతి పండుగకు నిత్యావసర వస్తువులు ఉచితంగా అందజేసి పండుగ కానుకగా వారిని ఆనందంలో ముంచేశారు. ఇప్పుడేమో ఏపీ పౌరసరఫరాల శాఖలో పని చేసే కూలీలకు దసరా కానుక ఇచ్చి వారిని ఉక్కిరిబిక్కిరి చేశారు. పౌరసరఫరాల శాఖలోపని చేసే కూలీలకు చంద్రబాబు దసరా కానుకగా 3వేల రూపాయలు, రెండు జతల బట్టలతో పాటు, ఓ కేజీ స్వీటు చేతిలో పెట్టారట. ఈ కానుకను మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, కిమిడి మృణాళిని అందజేశారు. ఊహించని రీతిలో ఇంత భారీగా దసరా కానుకను పొందటం పౌరసరఫరాల శాఖ కూలీలు చెప్పలేని ఆనందం లో మునిగిపోయారు. బాబుగారు ఇలా కానుకలతో కార్మికుల మనసులు కొల్లగొట్టేస్తున్నారన్నమాట.