తెలంగాణ కాబోయే సీఎం... వింటే ఫీలవుతారు

September 30, 2015 | 12:58 PM | 2 Views
ప్రింట్ కామెంట్
harish-rao-next-CM-telangana-in-assembly-niharonline

స్వతంత్ర్య తెలంగాణలో తొలి జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గులాబీ దండుకు పట్టం కట్టారు ప్రజలు.  ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన పోరాట యోధుడిగా బరిలోకి దిగిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రజలు సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు. ఐదేళ్ల దాకా అధికారాన్ని కట్టబెట్టారు. ఇక ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. మరి ఆయన తర్వాత ఆ పీఠం ఎవరిది? తెలంగాణకు తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? ఈ విషయమై ప్రజలను ప్రశ్నిస్తే... ఎలాంటి స్పందన వస్తుందో తెలీదు. కానీ, తెలంగాణ అసెంబ్లీ లోనే నెక్స్ట్ సీఎం ఎవరనేది క్లారిటీ ఇచ్చేందుకు నేతలు ప్రయత్నించారు. అయితే అది విపక్షాలు లేండి.

                  తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం విపక్ష ఎమ్మెల్యేలు కొందరు ఈ మేరకు సభలో ఆసక్తికర కామెంట్లు విసిరారు. విషయంలోకి వస్తే... నిన్న రైతు ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడేందుకు సిద్ధమవుతున్న సమయంలో సీఎం కేసీఆర్ సభ నుంచి బయటకు వెళ్లేందుకు తన సీట్లో నుంచి లేచారు. దీనిని గమనించిన ఎర్రబెల్లి ‘‘సీఎంగారు సభలో ఉండాలని కోరుకుంటున్నాం. నేను చెప్పేది ఆయన వినాలని అనుకుంటున్నాను’’ అని అన్నారు. వెనువెంటనే విపక్షాలకు చెందిన సీట్లలోని కొందరు సభ్యులు ‘‘కాబోయే సీఎం ఉన్నారులే. ఆయన వింటారులే’’ అంటూ మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో నేతలందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ కాసేపు చర్చించుకున్నారట.

టీఆర్ఎస్ లో రెండు గ్రూప్ లు ఉన్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. ఒకటి కేసీఆర్ తనయుడు కేటీఆర్, మరోకటి హరీష్ రావు గ్రూప్. అయితే ఇలా ఉన్నప్పటికీ అధినేత కనుసన్నళ్లో వారు సైలెంట్ గా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఎక్కడా కూడా గ్రూప్ రాజకీయాలను బయటపడనీయలేదు. ఇక ఇప్పుడు ఈ కామెంట్లతో కాస్త తేడా వాతావరణం అసెంబ్లీలో నెలకొందని తెలుస్తోంది. అయితే బూట్ల చప్పుడు పడదంటూ హోం మినిస్టరీని వద్దనుకున్న హరీష్ రావు ఇప్పుడు సీఎం పదవికి ఎగబడతారా? ఉడికించడానికే ప్రతిపక్షాలు అలా మాట్లాడి ఉంటాయేమో.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ