ముద్రగడకు తెలంగాణ నుంచి ఫుల్ సపోర్ట్

February 05, 2016 | 02:05 PM | 1 Views
ప్రింట్ కామెంట్
VH-support-to-mudragada-padmanabham-fast-niharonline

కేసులకు భయపడి తాను గృహ నిర్బంధం విధించుకున్నాననే అపవాదు రాకూడదనే భావనతోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగానని చెప్పారు ముద్రగడ పద్మనాభం. కాపుల రిజర్వేషన్లకు సంబంధించి స్పష్టమైన హామీ ఇస్తే దీక్షకు దిగబోనని తాను ప్రభుత్వ ప్రతినిధులతో చెప్పినట్లు ఆయన తెలిపారు.

                కాగా, ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు తెలంగాణ నుంచి కూడా మద్దతు లభించింది.  కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆయన దీక్షకు మద్దతు తెలిపారు. ముద్రగడ చేస్తున్న దీక్షలో న్యాయం ఉందని, తనపైనా నమోదైన కేసులకు భయపడేది లేదని వీహెచ్ చెప్పారు. కాపులకు రిజర్వేషన్లతో బీసీలకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామంటూనే సీఎం చంద్రబాబు మరోవైపు బీసీలను కావాలని రెచ్చగొడుతున్నారని వీహెచ్ ఆరోపించారు.

మరోవైపు తన ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాని నేపథ్యంలోనే గత్యంతరం లేక ఆమరణ దీక్షకు దిగినట్లు ముద్రగడ తెలిపారు. ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించేందుకు తాను ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నానని ఆయన తెలిపారు. ప్రభుత్వం మంచి ప్రతిపాదనతో ముందుకు వస్తే, ఇప్పటికిప్పుడు దీక్ష విరమించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ముద్రగడ తేల్చిచెప్పారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ