విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) సీనియర్ నేత అశోక్ సింఘాల్ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గుర్గావ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. ఆయన మృతి విషయాన్ని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ధృవీకరించారు.
వయసురీత్యా వచ్చే అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో అక్టోబరు 20న ఇదే ఆస్పత్రిలో చేరి మూడ్రోజుల కిందే ఆయన ఇంటికొచ్చారు. సోమవారం ఉదయం ఆయన పరిస్థితి విషమించటంతో తిరిగి ఆస్పత్రిలో చేర్పించారు. కీలకనేతలంతా సోమవారం ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.