సమంత చీరకట్టుపై వెంకయ్య సెటైర్

November 17, 2015 | 01:13 PM | 2 Views
ప్రింట్ కామెంట్
venkaiah-naidu-on-actress-samantha-saree-wearing-style-niharonline

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఛలోక్తులు గురించి మనకు తెలిసిందే. గుండు పిన్ను దగ్గర నుంచి గన్ దాకా, ప్యూన్ దగ్గరి నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా ఆయన వాక్ చాతుర్యానికి బలి కాని వస్తువు లేదు. అలాంటి వ్యక్తి  నోటి వెంట హీరోయిన్ సమంత పేరు వచ్చింది. అది కూడా ఆమె చీరకట్టుపై సెటైర్ వేశారాయన. 'ఆమె అప్పుడప్పుడు చీరను కట్టుకుంటుంది' అని చమక్కులు పేల్చారాయన.

సోమవారం గుంటూరు లాం సమీపంలో వ్యవసాయ యూనివర్శిటీకి శంకుస్థాపన జరిగిన వేళ, సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు వేదికపై ఉండగా, ప్రసంగించిన వెంకయ్య, ఇటీవలి మోదీ బ్రిటన్ పర్యటనను గుర్తుకు తెచ్చుకున్నారు. మోదీకి స్వాగతం పలికేందుకు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ భార్య చీర కట్టుకు వచ్చిందని చెప్పారు. (ఆమె పేరు కూడా సమంతాయే) మోదీ ప్రభావంతో, భారతీయతకు అద్దం పడుతూ సమంత చీరకట్టుకుని వచ్చారని, మనకూ ఓ సమంత(నటి) ఉందని, ఆమె అప్పుడప్పుడూ చీరలో కనిపిస్తుందని సెటైర్లు వేశారు. మన సమంత చీర కట్టిందంటే సరే, కామెరాన్ భార్య కూడా కట్టుకుందంటే 'అది మోదీకి దక్కిన గౌరవమే' అన్నారు. ఆయన మాటలతో వేదికపై నవ్వులు వెలిశాయి. కొంపదీసి ఆయన కూడా సమంత ఫ్యాన్ కాదు కదా!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ