పటేల్ ను ఫాలో అయితే పని అవుతుందా?

December 07, 2015 | 12:07 PM | 1 Views
ప్రింట్ కామెంట్
VHP_Modi_Ayodhya_Ram_temple_niharonline

మతాల మధ్య చిచ్చు పెట్టి మారణ హోమం సృష్టించిన ఘటన బాబ్రీ మసీదు కూల్చివేతకు ఆదివారంతో 23 ఏళ్లు పూర్తయ్యింది. భిన్నత్వంలో ఏకత్వమనే మన ఔనత్యానికి మాయని మచ్చ మిగిల్చింది ఈ సంఘటన. పైకి మసీదు కూల్చివేతను హేయమైన చర్య అని అభివర్ణించిన అప్పటి నేతలు అటుపై అనేక సందర్భాలలో రామ మందిరం నిర్మాణంపై మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. ఖచ్ఛితంగా ఆ ప్రదేశంలో మందిర నిర్మాణం జరిపి తీరాలని పలు హిందుత్వ సంఘాలు ఇప్పటికీ పట్టుబడుతూనే ఉన్నాయి.  

ఇక పూర్తి హిందుతత్వ భావజాలాలు బీజేపీకి ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితి దాపురిస్తుంది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా హిందువుల చిరకాల కోరికను నెరవేర్చటం లేదంటూ మిత్ర పక్షాలు మండిపడుతున్నాయి. మోదీ పాపులారిటీ తిరిగి పెరగాలంటే రామ మందిరం నిర్మించాలని శివసేన సామ్నా లో గర్జించి గంటలు గడవక ముందే మరో మిత్ర పక్షం అదే అంశంపై కెలుకుతుంది.

విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా భోపాల్ లో మాట్లాడుతూ.... మసీదును కూల్చిన ప్రాంతంలోనే రామ మందిరాన్ని నిర్మించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానాల్లో రామ మందిర నిర్మాణ విషయం ఉందని గుర్తు చేస్తున్నారయన. ఇక్కడ ఉన్న చిక్కులు తొలగాలంటే గతంలో సోమనాథ్ ఆలయ నిర్మాణానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యవహరించిన తీరునే ప్రస్తుతం మోదీ అనుసరించాలని కూడా సలహ ఇస్తున్నారు. అంతేకాదు మందిరం నిర్మాణానికి సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని మోదీని డిమాండ్ చేస్తున్నారు.

నిజానికి సోమనాథ్ ఆలయం విషయంలో పరిస్థితులు వేరు. తురుష్కుల దండయాత్రతో తీవ్రంగా దెబ్బతిని ఆ స్థానే మసీదులు కట్టబడ్డాయి. స్వాతంత్ర్యం అనంతరం జునాగఢ్ సంస్థానం భారత్ లో విలీనం అయిన తర్వాత దేశ మొదటి హోం మంత్రిగా ఉన్న పటేల్ పూనుకుని దానికి గత వైభవం తీసుకొచ్చారు. అక్కడున్న మసీదును తరలించేందుకు కానీ, గుడిని పున:ప్రతిష్టించేందుకు కానీ అప్పుడేం అడ్డంకులు లేవు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో రామ మందిర నిర్మాణం సాధ్యమయ్యే పనేనా అన్నది మాత్రం జవాబు లేని ప్రశ్నగా మిగులుతుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ