హిట్లర్ అదేం బూతు కాదు కదా?

December 10, 2015 | 11:57 AM | 1 Views
ప్రింట్ కామెంట్
m-venkaiah-naidu-congress-modi-hitler-niharonline

ప్రజల నుంచి ఎలాంటి మద్ధతు లేకపోయినా బాగా మాట్లాడుతారన్న ఒకే ఒక్క కారణంతో రాజకీయాల్లో రాటుదేలారు వెంకయ్య నాయుడు. ప్రత్యక్షంగా కాకుండా పరోక్ష రాజకీయాల ద్వారానే ఆయన ఇఫ్పటికీ రాణిస్తున్నారు. వ్యక్తిగతంగా ప్రధాని మోదీకి దగ్గరి వాడు కావటంతోపాటు, సమయస్పూర్తితో ఆయనకు సూచనలు ఇస్తూ పాలనాపరంగా కేంద్రానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటంలో వెంకయ్య పాత్రను తక్కువ చేయలేం. అదే సమయంలో ప్రతిపక్షాలను సెటైరిక్ గా ఎదుర్కోవటంలో ఆయనదే. ప్రధాన పాత్ర. పురాణాలను, సినిమాలను ఇలా వేటిని వదలకుండా ఉదాహరణలతో మరీ అవతలి వాళ్లకి కౌంటర్లు ఇస్తుంటారు. మరి అలాంటి వ్యక్తి ప్రధానిని విమర్శిస్తే ఊరుకుంటారా?     

                   ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలలో కాంగ్రెస్ చేస్తున్న రసాభాస తెలసిందే. సభ జరగకుండా కార్యకలాపాలను అడ్డుకుంటూ వివాదాలను లేవనెత్తుతుంది. ఇదే క్రమంలో గురువారం లోక్ సభలో కాంగ్రెస్ సభ్యుల ఆందోళన చేస్తున్నారు. అయితే అందులో భాగంగా నరేంద్ర మోదీని హిట్లర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి చిర్రెత్తుకొచ్చింది. వెల్ లో ఆందోళన చేయడమే కాక, ప్రధాని నరేంద్ర మోదీని హిట్లర్ అంటారా అంటూ మండిప్డడారు. డార్లింగ్ ఆఫ్ ఇండియన్ మాసెస్ (భారత ప్రజల ప్రియతముడు) అయిన మోదీని హిట్లర్ అనడం ఎంత వరకు సబబు అని వారిని ప్రశ్నించారు. ఒక ప్రధానిని పట్టుకుని సాక్షాత్తు పార్లమెంటులో ఇలా సంబోధించడం అత్యంత దారుణం అని అన్నారు. ఇన్నేళ్ల తన రాజకీయ చరిత్రలో పార్లమెంటులో కాని, బయటకానీ తాను ఎవరి గురించి ఇలా మాట్లాడలేదని చెప్పారు. ఇంతకీ హిట్లర్ అంటే అదేం పెద్ద బండ బూతు కాదు కదా వెంకయ్య?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ