అలా అనేశారేంటి నాయుడు గారూ?

July 18, 2015 | 04:49 PM | 4 Views
ప్రింట్ కామెంట్
venkaiah_naidu_on_rajahmundry_incident_controversary_comments_niharonline

మానవ సంబంధాల విషయాల్లో అజాగ్రత్తగా వ్యవహారిస్తే సర్వానర్థాలకు హేతువయ్యి ఊహించని పరిణామాలు ఎదురవ్వగలవు. పైగా నోరు మంచిదైతే ఊరుమంచిదేగా! శ్రీరాముడు, రఘువంశకులు మిత బాషులు సుమా అని వాక్రుచ్చి ఉన్నాడు. ఆంతర్యమేమంటే అతిగా మాట్లాడినప్పుడు పొరపాటున అబద్ధాలో, అపభ్రంశపు మాటలో దొర్లవచ్చునని, ఈ పురాణ పురుషులెవ్వరూ ఎన్నికల్లో పోటీచేసి సింహాసనమదిష్ఠించిన పాపాన పోలేదు. తత్కారణంగా మంచి లావు వక్తలుగా పేరుగడించే అగత్యం ఏర్పడలేదు.

ప్రజాస్వామ్యమనే బ్రహ్మపదార్థం రూపుదిద్దుకున్న తదాది మూగవాడెవరూ నాయకులైన దాఖాలాలు అరుదు. వెంకయ్య జై ఆంధ్ర ఉద్యమ సందర్భంగా తెన్నేటి విశ్వనాథం గారి అనుచరుడిగా వెలుగులోకి వచ్చేడు. మంచి వక్తగా రాణించేడు. అంచెలంచెలుగా ఎదిగేడు. మరి మాటకారి అయినవాడు మౌనంగా ఎలా ఉండగలడు? ఆ ప్రావీణ్యతే అభాసుపాలు అయ్యే సదుపాయం కల్పించినట్లయ్యింది నాయుడిగారికి. రాజమండ్రి పుష్కరాల సందర్భంగా జరిగిన ఘోర కలిలో సుమారు ముప్ఫై మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. దీనిపై ఎవరి లాభనష్టాలు లెక్కలేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటివి కొత్తకాదు, గతంలో చాలా జరిగేయి. రాద్ధాంతం అనవసరమని మన ప్రియతమ నాయకుడు ఓ సందేశం ఇవ్వటం జరిగింది. ఇంకేముంది... బుగ్గలు నొక్కుకుంటూ ఎంతమాట... ఎంతమాట... అని తలా ఓ రాయి తీసుకుంటున్న వైనం గమనిస్తున్నాం. ఆ బొందితో కైలాసం చేరుకున్న సోదర సోదరీమణుల్లో ఎవరైన మన కుటుంబసభ్యులు ఉండి ఉంటే ఇలా ‘లైట్’ తీస్కో అని అనగలరా ముప్పువరపు వారి వంశాంకురమా?  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ