ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అసెంబ్లీలో గురువారం ప్రతిపక్షం నుంచి మంచి కౌంటరే పడింది. సభలో కోడాలి నాని లాంటి సీనియర్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం కు సరైన కౌంటర్లు ఇచ్చేవారే కరువైయ్యారనే చెప్పాలి. అలాంటిది టీడీపీ గవర్నమెంటు కు ఓ యువకెరటం నుంచి మాంచి పంచే పడింది. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు వైసీపీ యువఎమ్మెల్యే, భూమా అఖిల ప్రియ. డీజిల్, పెట్రోల్ లపై వ్యాట్ పెంపుపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ .... దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినప్పటికీ ఏపీ ప్రభుత్వం మాత్రం వ్యాట్ విధించటం వల్ల సామాన్యులపై పెనుభారం పడుతుందన్నారు. దేశంలో ఏపీలోనే ఎక్కువగా వ్యాట్ విధిస్తున్నారని ఆయన చెప్పారు. దాంతో సామాన్యుల నుంచి రైతుల నుంచి రైతుల వరకూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారిన సభకు వివరించారు. ఇక అసలు మ్యాటరేంటంటే... ‘‘రాబిన్ హుడ్ ధనవంతులను దోచుకుని ఆ సంపదను పేదలకు పంచితే... రాష్ట్ర ప్రభుత్వం(టీడీపీ ప్రభుత్వం) మాత్రం పేదలను దోచుకుని ఆ సంపదను సంపన్నులకు పెడుతోందని’’ ఆమె అన్నారు. అంతేమరీ ఎంతైనా తల్లికి తగ్గ తనయగా నిరూపించుకోవాలంటే ఆ మాత్రం కౌంటర్ లు ఇవ్వాల్సిందే కదా.