దూషణల పర్వానికి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ వేదిక అవుతోంది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ మాటలు గురువారం కూడా కొనసాగాయి. సభా కార్యక్రమాలను అడ్డుకున్న 8 మంది వైకాపా సభ్యులను సస్పెన్షన్ కోసం అధికార పార్టీ ప్రతిపాదించిన తీర్మానానికి స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆమోదం తెలిపారు. దీంతో స్పీకర్ పై విరుచుకుపడ్డ వైసీపీ సభ్యులు ఆయనను ఫ్యాక్షనిస్టుగా అభివర్ణించారు. సభలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇక టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ సభ్యులపై ఆగ్రహాం వ్యక్తంచేశారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సభ్యులను ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. అంతే మరీ గౌరవ హోదాలో ఉన్న స్పీకర్ ను ఇలా ఫ్యాక్షనిస్టు అని పేర్కొనటం వైసీపీ సభ్యురాలు రోజాని టీడీపీ నేతలు ఆంటీ అని సంభోదించటం కన్నా ఘోరమే కదా.