నేను అడగదల్చుకున్నా... గొంతు మీదా కాదా?

September 04, 2015 | 11:16 AM | 6 Views
ప్రింట్ కామెంట్
ys-jagan-cash-for-vote-scam-chandra-babu-niharonline.jpg

వైఎస్ ఫోటో కథ ముగిసిపోవటంతో ఇప్పుడు ఓటుకు నోటు కేసు ను ఆయుధంగా చేసుకుని  విరుచుకుపడాలని వైసీపీ భావిస్తోంది. ఇందులో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడినట్లుగా వెలుగులోకి వచ్చిన ఆడియో టేపు పై ప్రతిపక్ష నేత జగన్ ప్రశ్నించారు. అసలు ఆడియో టేపుల్లో ఉంది చంద్రబాబు గోంతేనా? కాదా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి చాలు అని అసెంబ్లీ లో ఇవాళ్ల ప్రశ్నించారు. తన గొంతే అయితే  అవునని, కాదని భావిస్తే కాదని చెప్పమనండి అని సూటిగా బాబును ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పే దమ్ము ధైర్యం లేకనే, తమ పార్టీపై ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రజలను మోసం చేస్తోందని వైకపా అధినేత మండిపడ్డారు. అంతకు ముందు కేసీఆర్, జగన్ మధ్య గత రాత్రి ఫోన్ సంభాషణలు నడిచాయని అచ్చెన నాయుడు ఆరోపించారు. దీనిపై జగన్ స్పందిస్తూ అలా జరిగితే తాను రాజీనామా చేస్తానని, దాన్ని నిరూపించలేని పక్షంలో చంద్రబాబు రాజీనామా చేస్తారా అని సవాలు విసిరారు. కేసీఆర్, చంద్రబాబు కలిసున్న ఫోటోలను చూపిస్తూ... వీరిద్దరూ కలిసి ఎన్నికల్లో పోటీచేశారని. ఈ తతంగం చూస్తుంటే, దొంగతనం చేయడం తప్పుకాదని, దొంగను పట్టుకోవటం నేరమని చెబుతున్నట్లు ఉందని విమర్శించారు. అసలు చార్జీషీట్ లో 22 సార్లు జగన్ పేరు ప్రస్తావనకు వచ్చిందని, చివరగా అసలు ఆ గొంతు మీదా కాదా అని మరోసారి ప్రశ్నించి తన ప్రసంగాన్ని ముగించాడు. మరి దీనిపై బాబు స్పందన ఏంటో కాసేపట్లో తెలియనుంది.    

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ