మచ్ మైట్ బి సెడ్ ఆన్ బోత్ సైడ్స్ అనేది షేక్స్ పీరియన్ ఎక్స్ ప్రెషన్. అంటే ప్రతి నాణేనికి రెండు వైపులా వేర్వేరు బొమ్మలుండేటట్టు-ఎక్కడో షోలే లో ఉన్న రూపాయి అరుదుగా ఉంటుంది.
అసెంబ్లీ మొదలయింది. ఇంతకుముందు పార్లమెంటు అయినా, అసెంబ్లీ అయినా చతుర సంభాషణలు, వివరాణాత్మక, వినోద వాద ప్రతివాదాలు రాజ్యాంగం నుంచి కొటేషన్లు ఇలా ఆదర్శవంతంగా సాగేవి. మీనింగ్ ఫుల్ గా సభాసమయం వృథా కాకుండా చూసుకునే పొదుపరులుండేవారు. ఇక మన ఖర్మగాలి కుక్క మూతి పిందెల కేక విలసాలకి అసెంబ్లీలు వేదికలయిపోయాయి. ముఖ్యమంత్రిని ఎన్నుకొన్న వారందికి విజ్నత, విచక్షణ కొరవడినట్లుగానూ, ముఖ్యమంత్రి అబద్ధాల కొరుగానూ అదేపనిగా ప్రతిపక్షం గోబెల్స్ ఆదర్శంగా ఊదరగొడుతోంది. ఏ పక్షానికి చెందని వారికి కూడా చిర్రెత్తుకొస్తోంది. ఇదేలా ఉందంటే ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పేందుకు మైక్ ఇస్తారు. మేం అబద్ధాలు చెప్పడానికి మైకు ఇవ్వరన్నట్లుంది. నోటు పట్టుకొచ్చి చదివేరు ముఖ్యమంత్రిగారు కానీ దానిలో ఉన్న మేటరు వేరు అని ప్రతిపక్షం వాదన. ఇవన్నీ పక్కనబెట్టి రాష్ట్రానికి మేలు జరిగేలా పోరాటం చెయ్యాలి. ఆత్మహుతుల్ని ప్రోత్సాహించొద్దు.