ప్రతిపక్ష నేతగా పూర్తిగా విఫలమైన జగన్ జనాకర్షణలోనూ రాను రాను తగ్గిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు దాకా జగన్ ఎక్కడికెళ్లినా నీరాజనం పట్టిన జనం, ఆపై పట్టించుకోవటం పూర్తిగా మానేశారు. అడపా దడపా శంఖారావం అంటూ, సత్యాగ్రహ దీక్షలంటూ కలరింగ్ ఇస్తున్నప్పటికీ అవేం ప్రజలకు ఆనట్లేదు. పైగా ప్రజా సమస్యలపై పోరాడటంలో ఆయన పూర్తిగా ఫెలవుతున్నారని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అయితే ప్రతిపక్షంకి పరిమితమైన తర్వాత జగన్ ఎక్కడికెళ్లినా చెప్పుకొచ్చే మాట తదుపరి సీఎం నేనేనని. మొదట్లో ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని, పడిపోయి మళ్లీ ఎన్నికలు వచ్చి తాను అధికారం చెపడతానని, ఆపై రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఇలా చెప్పుకునేవాడు.
ఇక ఓవైపు వలసలు కొనసాగుతున్న ఈ టైంలో కూడా అదే పాట పాడటంతో జగన్ కి అసలు ఏమౌతోందా అని సొంత నేతలే ఆరాలు తీస్తున్నారంట. తాజాగా జగన్ తన సొంత జిల్లా కడపలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రెండు రోజులూ పూర్తిగా సొంత నియోజకవర్గం పులివెందులకే పరిమితమయ్యాడు. తనను కలిసేందుకు వచ్చిన పార్టీ నేతలు, ప్రజలతో కులాసాగా మాటలు కలిపారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు ‘‘సార్, మిమ్మల్ని సీఎంగా చూడాలనుంది’’ అంటూ కోరగా, అంతే వేగంగా స్పందించిన జగన్ కూడ ‘‘మీ కోరిక నెరవేరుతుందిలేమ్మా’ అంటూ బదులిచ్చారు. ఈ టైంలో కూడా ఆ మాట నోటి నుంచి వచ్చిందంటే జగన్ గుండె నిజంగానే గట్టిదని ప్రత్యర్థులు జోకులు పేల్చుకుంటున్నారంట.