జగన్ కి ఝలకిస్తున్న సొంత ఎమ్మెల్యే

April 06, 2015 | 12:11 PM | 62 Views
ప్రింట్ కామెంట్
jagan_reddy_adi_narayana_reddy_niharonline

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత పార్టీ పోరు తప్పేలా లేదు. తాజాగా మరో ఎమ్మెల్యే అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం చర్చనీయాంశమౌతోంది. సముద్రంలో కలిసిపోతున్న నదీ జలాలను మళ్లించడం ద్వారా రాయలసీమ నీటి అవసరాలు తీర్చేందుకంటూ పట్టిసీమ  ప్రాజెక్టును చంద్రబాబు సర్కార్ ప్రతిపాదించింది. అయితే ఏళ్ల క్రితం ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టును వదిలి కొత్త ప్రాజెక్టుల పేరిట చంద్రబాబు నిధుల దోపిడీని తెరతీశారని జగన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో జగన్ పార్టీ అధికార పక్షాన్ని అడుగడుగునా ఇబ్బంది పెట్టింది. ఢిల్లీ వెళ్లిన జగన్, కేంద్రానికి కూడా చంద్రబాబుపై ఫిర్యాదుచేశాడు. తన తాబేదారైన కాంట్రక్టర్ కోసమే చంద్రబాబు పట్టిసీమను ప్రతిపాదిస్తున్నారని మోదీ సర్కార్ వద్ద మొరపెట్టుకున్నారు. అయితే పట్టిసీమ ప్రాజెకట్ రాయలసీమకు తప్పనిసరి అని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారయణ రెడ్డి గళం విప్పారు. పట్టిసీమ పూర్తైతే రాయలసీమ రతనాల సీమ అవుతుందని ఆయన వాదిస్తున్నారు. అంతేకాదు ప్రత్యేకించి జమ్మలమడుగులోని పలు ప్రాజెక్టులు నిండుతాయని ఆయన అంటున్నారు. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే ఇలా ప్రభుత్వానికి మద్ధుతుగా వ్యాఖ్యలు రావటం జగన్ కి మింగుడుపడటం లేదు. మరీ వ్యాఖ్యలపై జగన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ