గోవా వస్త్ర దుకాణంలో రహస్య కెమెరా పెట్టి దుస్తులు మార్చుకుంటున్న ఘటనను చిత్రీకరిస్తున్న ఫ్యాబ్ ఇండియా నిందితులు నలుగురికి గోవా న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గోవాలోని ఫ్యాబ్ ఇండియా వస్త్ర దుకాణంలోకి షాపింగ్ కు వెళ్లిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మ్రుతి ఇరానీ, రహస్య కెమెరాలను గుర్తించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళన రేగింది. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న 48 గంటల్లోనే వీరికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం విశేషం. కాగా, వీరిని గోవా వదిలి వెళ్లవద్దని న్యాయస్థానం ఆదేశించింది.