బాబుని చూసి హ్యాపీగా ఫీలవుతున్న జగన్ ఎమ్మెల్యే

March 15, 2016 | 03:03 PM | 1 Views
ప్రింట్ కామెంట్
MLA-Sridhar-Reddy-Fires-Chandrababu-niharonline

అవిశ్వాస తీర్మాన సమయంలో కూడా ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలు, అవాక్కులు, చవాక్కులు పేల్చటం బహుశా వైసీపీకే చెల్లుతుందేమో. ప్రతిపక్షంగా పూర్తిగా ఫేలవుతూ వస్తున్నప్పటికీ, ప్రభుత్వంపై ఆరోపణలు చేయటంలో మాత్రం ముందుంది. అయితే తనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని చూస్తుంటే చాలా ఆనందం కలుగుతోందని వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించాడు.

స్పీకర్ కోడెల శివప్రసాద్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రారంభిస్తూ మాట్లాడుతూ... "అధ్యక్షా... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాకు పెద్దన్న వంటి వారు. తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్న ఆయన్ను చూస్తుంటే నాకు ఆనందం కలుగుతుంది. తన పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం నాలుగంటే నాలుగు ఆచరణ సాధ్యం కాని హామీలను ఆయనిచ్చారు. పార్టీని అధికారంలోకి తెచ్చారు అని పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు పొగుడుతూ మాట్లాడుతున్నాడేంటీ అంటూ అప్పటి దాకా నోళ్లు తెరిచి కూర్చున్న మిగతా వైకాపా నేతలు చివర్లో మాటలకి వైకాపా నేతలు చప్పట్లు కొట్టడం కనిపించింది.

                                 తమ సభ్యురాలు రోజాను నిబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు సస్పెండ్ చేశారని గుర్తు చేసిన ఆయన, ఒకవేళ ఆమె అభ్యంతరకర మాటలు మాట్లాడారనే అనుకుంటే, సీఎం చంద్రబాబు అంతకుమించిన పరుష పదజాలం వాడారని ఆరోపించారు. "నీ అంతు చూస్తానని ఆయనన్నా చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు అధికార ఎమ్మెల్యే ఒకరు, మా ఎమ్మెల్యేను చంపేస్తానని అన్న వ్యాఖ్యలు రికార్డుల్లో ఉన్నాయి. అయినా వాటిపై చర్యలు లేవు. అందుకే స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం అంటూ తన ప్రసంగం ముగించాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ