ప్రతిపక్షంలో ఉండి విమర్శలు చేసేందుకు నేతలకు ఓ అర్హత, పాడు అక్కర్లేదు. ఎవరు పడితే వారు ఎక్కేయొచ్చు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందుకు అతీతం. అధికార పక్షం చేసిన తప్పులను దొరకబుచ్చుకుని అస్త్రాలుగా వాడుకోవటంలో అక్కడి పార్టీలు విఫలమవుతూనే ఉన్నాయి. చేసేది లేక ఏదో సిల్లీ రీజన్స్ తో కాలం గడిపేస్తున్నాయి. కానీ, అవేం ప్రభుత్వ ఇమేజ్ ను డామేజ్ చెయ్యలేకపోతున్నాయ్.
ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉండి కూడా వైఎస్సార్సీపీ లో విమర్శలు చేసే నేతలు కరువైపోయారు. అడపాదడపా అధినేత జగన్ టీడీపీ పై విరుచుకుపడుతున్నా... అవన్నీ వ్యర్థమే. కానీ, నటి, ఎమ్మెల్యే రోజా మాత్రం ఆ లోటును పూడ్చటంలో సక్సెస్ అవుతూ వస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా టీడీపీ నేతలను, ముఖ్యంగా చంద్రబాబును కూడా ఎస్కుకుంటూ ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించారు. ఛాన్స్ దొరికనప్పుడల్లా సీన్ లోకి వచ్చి రచ్చ రచ్చ చేస్తూ మీడియాల్లో హల్ చల్ చేస్తుంది రోజా. సీనియర్లకు కూడా దొరకని సబ్జెక్టులను అలవోకగా దొరకబుచ్చుకుని దూసుకెళ్తుంది.
తాజాగా రాజశేఖర్ రెడ్డి అభిమాని సూరయ్య హత్యకేసుపై ఆమె స్పందిస్తూ... ఏపీ మంత్రి అచ్చెన నాయుడు, టీడీపీ ఎమ్మెల్సీలు పయ్యావుల, గాలి ముద్దు కృష్ణమ నాయుడులపై విమర్శలు గుప్పించారు. వీరు ముగ్గురు సైకోల్లా వ్యవహారిస్తున్నారని, అధికారం మాటున అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పేదల భూములను అక్రమంగా లాక్కుని ఎదురు తిరిగిన వారిని హత్యలు చెయ్యటానికి కూడా వెనకాడటం లేదని మండిపడ్డారు. శవ రాజకీయాల ద్వారా అధికార పక్షంపై విమర్శలు గుప్పించటంతో రోజా రాజకీయాల్లో బాగా రాటుదేలుతుందని అర్థమౌతుంది. కీప్ గోయింగ్...