లోకేష్ తొడకి చాలా పవర్ ఉందన్న రోజా

February 25, 2016 | 12:57 PM | 4 Views
ప్రింట్ కామెంట్
YSRCP-MLA-roja-fire-on-nara-lokesh-niharonline

ఓవైపు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వైకాపా ఖాళీ అవుతున్న వేళ ఫైర్ బ్రాండ్ రోజా మాత్రం అధికార పక్షంపై విమర్శలు మానటం లేదు. ఎవరు పార్టీని వీడినా వచ్చిన నష్టమేమీ లేదని జగన్ కు అండగా మేముంటామని ఆమె అంటున్నారు. పనిలో పనిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై ఆమె విమర్శలు సంధించారు. ఆయనది ఓ ఐరెన్ లెగ్ అని ఆమె వ్యాఖ్యానించారు. గురువారం ఉదయం తన భర్తతో కలసి అన్నవరానికి వచ్చిన ఆమె వ్రతం  అనంతరం మీడియాతో మాట్లాడారు.

                          ఏపీలో అసలు ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్న లోకేష్, తెలంగాణలో తొడగొడితే, అక్కడ టీడీపీ ఖాళీ అయిందని, ఇక ఏపీలోనూ అదే పని చేస్తున్నాడని వైకాపా ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. పార్టీని వీడి వెళ్లిన నేతలతో వైకాపా బలహీనపడబోదని, కార్యకర్తల అండ ఉన్నంత కాలం తమకు ఎదురులేదని అన్నారు. లోకేష్ లాంటి వాళ్లు వంద మంది ఏకమైనా వైకాపా ను ఏం చేయలేరని, డబ్బు, పదవుల ఎరగా వేసి ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కొవటం సంస్కారం కాదని ఆమె అంటున్నారు.

            అసలు ఫిరాయింపుదారులు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తప్ప రాష్ట్రాభివృద్ధి కోసం వెళ్లలేదని అన్నారు. ప్రజల కోసం నిత్యమూ పోరాడుతూ ఉన్న జగన్ వంటి వ్యక్తికి దూరం కావడం వాళ్లు దురదృష్టమని, వారి స్థానంలో కొత్త నేతలను తయారు చేసుకునే శక్తి వైకాపాకు ఉందని ఆమె అన్నారు. మొత్తం మీద ఎవరూ వెళ్లినా ఫైర్ బ్రాండ్ గా తన స్థానం మాత్రం తనకు పదిలంగా మాటలతో మరోసారి తేల్చేశారు రోజా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ