దళితుల ప్రస్తావన ఎక్కడొచ్చిందబ్బా?

February 09, 2016 | 02:19 PM | 2 Views
ప్రింట్ కామెంట్
YSRCP-alleged-chandra-babu-insult-dalits-resignation-niharonline

దళితులను అవమానిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని, తక్షణమే  రాజీనామా చేయాలని ప్రతిపక్ష వైసీపీ డిమాండ్ చేస్తుంది. దళితులను అవమానించేలా మాట్లాడుతున్న చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టాలని రైల్వేకోడూరు ఎమ్మెల్యే .శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారని, కాపులను, బీసీలను బాబు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కించపరిచేవిధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని, టీడీపీ దళిత నేతలు ఇప్పటికైనా ఆలోచించుకోవాలని శ్రీనివాసులు సూచించారు. మరి చంద్రబాబు మాట్లాడింది ఏంటో ఓ సారి లుక్ ఏద్దాం.

                       ముద్రగడ దీక్ష విరమణ తర్వాత చంద్రబాబు మాట్లాడింది ఏంటంటే... కుల రాజకీయాలు కూడు పెట్టవని, కులాల పేర్లు చెప్పి ఓట్లు రాబట్టుకోవాలంటే అది కుదిరేపని కాదని వ్యాఖ్యానించాడు. తన దృష్టిలో ధనికులు, పేదలన్న రెండు కులాలే ఉన్నాయన్న ఆయన, తెలంగాణలో కేసీఆర్ ది, కేంద్రంలో మోదీది ఏ కులమని, వారి కులాలు చూసే ప్రజలు ఓట్లేశారా? అని ప్రశ్నించారు. గతంలో కులాల పేరు చెప్పి ఓట్లడిగిన మంద కృష్ణకు ఎన్ని ఓట్లు వచ్చాయని ప్రశ్నించారు. బెంగాల్ లో మమతా బెనర్జీ, ఒడిసాలో నవీన్ పట్నాయక్ వంటి వారెందరో కులాల రాజకీయాలకు అతీతంగా ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. ఎవరి చేతుల్లోనూ లేని కులం, ప్రాంతాలతో రాజకీయాలు చేయడం సరికాదని వైకాపాను ఉద్దేశించి హితవు పలికారు. అంటే చంద్రబాబు సరిగ్గానే మాట్లాడారన్నమాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ