దివంగత ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి 66వ జయంతి సందర్భంగా (జూలై 8) ఆయన కుమారుడు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు ట్విట్టర్లో తండ్రి జ్నాపకాలను గుర్తుచేస్తుకుని బాధపడ్డాడు. నాన్న మేము మీతోపాటు చాలానే కొల్పోయాం. కష్టంలో నా వెన్నంటి ఉండి, ఎల్లప్పుడూ అండదండగా నిలిచేలా ఓ పెద్ద కుటుంబాన్ని ఇచ్చి ఆయన వెళ్లిపోయారు. ఆయన గొప్పదనం, స్పూర్తిధాయకమైన జీవితం నన్ను ఆయన అడుగు జాడల్లో నడిచేలా ధైర్యాన్ని, మద్ధతును నాకివ్వండి అంటూ జగన్ ప్రజలనుద్దేశించి ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. తెలుగు ప్రజలు కన్నీళ్లు, కష్టాలతో జీవితం గడపకూడదన్న ఆయన ఆశయాన్ని కొనసాగించే దిశగా అడుగులు వేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాగా, అటు ఆంధ్రప్రదేశ్ లోనూ, ఇటు తెలంగాణలోనూ వైెఎస్సార్సీపీతోపాటు కాంగ్రెస్ పార్టీ ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి.