ప్రెస్ మీట్ లో పవన్ కిర్రాకు పుట్టించాడా?

July 07, 2015 | 05:45 PM | 5 Views
ప్రింట్ కామెంట్
actor_pawan_kalyan_on_politics_press_meet_photos_niharonline

మౌనం వీడిన పవన్, పత్రికా సమావేశంలో తనకే సొంతమైన బాణీలో విషయ పరిజ్ణానంపై అత్యంత శ్రధాసక్తులు కనబరచే హావభావాలతో ఖంగారు పడినట్టు, పడనట్టు గాంభీర్యముద్రలు ప్రదర్శించి చెప్పదలుచుకున్నది చెప్పినాడో లేదో అనిపించకుండా, ఇంకా పరిణితి చెందిన తర్వాత చూద్దురుగాని మావాడి తడాఖా అనిపించేలా... ఇదంతా ఎందుకొచ్చిన గోలగానీ పవన్ ప్రెస్ మీట్ ఎట్టకేలకు విలేకర్ల పుణ్యమా అని ముగించటం జరిగింది. దీన్లో హైలెట్లుగా భావించదగ్గ చెణుకులు కొన్ని ఆకట్టుకున్నాయి. ఏమీ మొహమాటం లేకుండా, నిరాసక్తంగా, నిర్లక్ష్యంగా, పార్లమెంటు మెంబర్లు అయ్యుండీ నిష్ఫూచీగా కాలక్షేపం చేస్తున్న సుజనాం సుఫలం అనుకుంటూ వ్యాపార భావాంకితులైన తెలుగుదేశం నాయకులను పవన్ తూర్పారబట్టేడు. రోడ్డుకిరువైపులా చెట్లు నాటించిన అశోక నామధేయుడినీ వదలలేదు. ఇక్కడ రాష్ట్రం తగలపడుతుంటే నేను విమానంలో అగ్గిపెట్టెలు తీసుకెళ్తా, తప్పేంటీ అంటున్న రాజావారినీ, నారాయణగార్నీ పేరుపేరునా బొట్టుపెట్టి మరీ చెప్పి చూశాడు. ‘‘చేతగాక పోతే రాజీనామా చెయ్యండి. కన్న రాష్ట్రమాతకి ప్రత్యేక హోదా తెచ్చి పెట్టి రుణం తీర్చుకునే ప్రయత్నం చెయ్యండి’’అని హితవు పలికేడు. పవన్ నుంచి సాహిత్యాభిలాషి, సుష్టుగా చదువు కుంటుంటాడు. చదివిందంతా పుక్కిటిపట్టి శ్రోతలకు రసవత్తరంగా అందించేందుకు అవధాని కాదుగదా! మనల్ని దోచుకుపోయిన ఆంగ్లేయుల సామెత ఒకటి ఈ సందర్భంగా ఉటంకించడం భావ్యమనిపిస్తుంది. ‘‘డయోరియా ఆప్ థాట్, కాన్సిటిఫేషన్ ఆఫ్ స్పీచ్... దీనిని అధిగమించి, వక్తగా రాణిస్తే నాయకత్వ లక్షణాలు పరిపూర్ణమయినట్లే, అభిమానులకు కిర్రాకు పుట్టించినట్టే!  జై హింద్...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ