బొత్స సత్తిబాబు. మంచివాడు. స్వతంత్ర భావాలు కలవాడు. ఇటీవలె ఒక సుముహుర్తాన రాజన్న పార్టీ గడపతొక్కేడు. మూగవారు రాజకీయాల్లో రాణించలేరని తెలిసిన జ్నాని. అంచేత మాట్లాడనారంభించేడు. ఓటుకి నోటు వ్యవహారం ఇప్పుడు కొద్దిగా కొక్కొరోకో అంది. అంతే ఆ ఓటు కోడి బొచ్చుపీక నారంభించేడు.
సదరు కేసులో పలుమార్లు (22 సార్లు) చంద్రబాబు పేరు ప్రతిధ్వనించిందనీ అయినా కేసీఆర్ ప్రభుత్వం లూజుగా వదిలేస్తోందని, సదరు దురదృష్ట రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లేసులో ఎవరైనా దానయ్య ఉంటే ఊరుకునే వారా అని కేసీఆర్ ని శక్తివంచన లేకుండా ఎగదోసే ప్రయత్నం బొత్స చేస్తున్నాడు. ఇన్ని విధాలుగా దోషి అని తెల్సినా ఆయన గారిని నిందితుడు అని పిలవడానికి కేసీఆర్ కి నోరు పెగలడం లేదని బొత్స మనసు కకావికలమవుతోంది. ఈ నెలాఖరుకి చంద్రుడు ఢిల్లీ ప్రయాణపు మర్మం కూడా విప్పి చెప్పేడు. హోదా కాదూ గోదా కాదు తన కేసు మోదీ తో చెప్పి కొట్టించేస్కోడానికే అని చెప్పి కక్ష తీర్చేసుకున్నాడు.
అద్దాల మేడలో ఉండి ఎదుటి వాళ్ల మీద రాళ్లు విసిరితే ఏమవుద్ది? వోక్స్ వ్యాగన్ లాటి బండరాళ్లు తిరిగి మీద పడతాయి! ఇటువంటి సూత్రీకరణలు రాజకీయాల్లో ఏ ఒక్కరీ సొత్తు కాదు!