దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంత మాటకారో మనకు తెలిసిన విషయమే. నవ్వుతూ ఎదుటి వారికి పంచ్ లు వేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఏ రేంజ్ లో సమస్య తీవ్రత ఉన్నా... అవతలి వారు విమర్శలతో విరుచుకుపడిన చిరునవ్వుతోనే సమాధానమిచ్చేవాడు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఆయనిచ్చే కౌంటర్ లు వారిపై దారుణంగా పేలేవి. ఒకనొక దశలో మహ మహా మాటకారి ఉద్ధండ పిండాలు కూడా ఆయన ముందు దిగదుడుపే. అలాంటి నాయకుడి తనయుడిగా జగన్ ఇప్పుడు వెలగబెడుతుందేంటి.
అలాంటి వ్యక్తి రాజకీయ వారసుడిగా జగన్ మీద అంచనాలు ఉండటం మామూలే. కానీ, ఆయన మాట్లాడే మాటలతో జనాల్లో ఇప్పుడు నవ్వుల పాలవుతున్నారు. తన మాటల కంటే.. జ్యోతిష్యుల మాటకు ఎక్కువ విలువ ఉంటుందని భావిస్తున్నరో.. లేక నమ్మకం కలుగుతుందని భావిస్తున్నారో కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. పులివెందుల పర్యటన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి తార్కాణం. మూడేళ్ల తర్వాత తానే రాష్ట్ర ముఖ్యమంత్రిని అవుతానని, అప్పటితో అందరి సమస్యలు పరిష్కారం అవుతాయని అభయ హస్తం ఇచ్చేరు. వెనువెంటనే మూడేళ్ల పాటు చంద్రబాబు ప్రభుత్వం ఉండనే ఉండదని జ్యోతిష్యులు చెబుతున్నారని అంటున్నాడు. మొత్తానికైతే నెక్స్ట్ ముఖ్యమంత్రిని తానేనని చెప్పుకోవటం ఆసక్తికరంగా మారింది. మూడేళ్ల పాటు చంద్రబాబు ప్రభుత్వం ఉంటుందా? ఉండదా? అన్న విషయాన్నిపక్కన పెడితే.. మూడేళ్ల తర్వాత ముఖ్యమంత్రి తానేనని చెప్పిన నోటితోనే.. అసలు మూడేళ్ల పాటు చంద్రబాబు ప్రభుత్వం ఉండదన్న పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేసే జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇక అక్కడ ఉన్న ప్రజలతో సహా నేతలు జగన్ వ్యాఖ్యలపై కామెంట్లు చేసుకున్నారట. ఓ ప్రతిపక్ష నేత లక్షణాలు ఆయనకు లేవనేవి నిర్మొహమాటంగా ఒప్పుకోవాల్సిన అంశం. మాటలతో మెంటల్ ఎక్కించకుండా, పిల్ల రాజకీయాల జోలికి పోకుండా ముందు పార్టీ భవిత్యం పై దృష్టి పెట్టి ఎలా మాట్లాడాలో నేర్చుకుంటే మంచిదని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.