తమ్మినేని సీతారాం, పూర్వాశ్రమంలో తెలుగు దేశం లో రాజకీయ భోగాలన్నీ అనుభవించిన అనుభవశాలి. కాలనుగతంగా సంభవించిన పరిమాణ, విపరిమాణాల రీత్యా ఈ అనుభవజ్నుడు, ఇంకా అనుభవాల లోతుల్ని గోతుల్ని దాటాల్సిన నాయకుడి పార్టీలో చేరడం జరిగింది. తన ఉనికిని గుర్తించాలంటే విమర్శనాస్త్రం వాడాలి. తన పార్టీ నాయకుడితలో ఏదైనా ఒక సద్గుణం ఎత్తి చూపిస్తే అందరి దృష్టిలో పడవచ్చు. కానీ పసిమోహన రెడ్డికి ఒకింత శాంతం తక్కువని తెలుసు. అందుకోసం బాబూ చంద్రనారాను ఎన్నుకుని సేఫ్ గేమ్ ఆడటం మొదలుపెట్టాడు. శుభమా అని విజయవాడ లింగమనేని పురింట్లో గృహ ప్రవేశం చేసిన చంద్రుణ్ణి పేరు ఎత్తు కుండా సతీమణి భువనమ్మని తప్పుబట్టారు సీతారాం. ఆ ఇంట్లో అశుభముహుర్తంలో ఆ పుణ్య దంపతులు అడుగుపెట్టడం వల్లే పిడుగులు పడి అంతమంది చనిపోయారని అభాండం వేసి అందర్ని మెప్పించే ప్రయత్నం చేశారు. కేశవర్థినికీ మోకాలుకి ముడిపెట్టడం అంటే ఇదే మరి! ఎవరైనా నవ్విపోదురుగాక సీతారాముడూ!