ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అసమ్మతి నేతలకు ఎట్టకేలకు ఉద్వాసన పలికారు. కేజ్రీవాల్ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేస్తున్న ఆప్ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్ లను పార్టీ నుంచి బహిష్కరించారు. ముందుగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆప్ అధ్యక్ష ఎన్నిక జరిపారు. అనంతరం పార్టీలో అసమ్మతికి ఆజ్యం పోసి, క్రమశిక్షణ ఉల్లంఘించిన వీరిద్దరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై వారిద్దరూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆప్ నేతలు గుండాల్లా వ్యవహరించారని ఆరోపించారు. పార్టీలో సంస్కరణలు కోరుతున్న వారిపై పిడిగుద్దులు కురిపించారని వారు తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ పై వారు తీవ్ర విమర్శలు చేశారు.