తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటుకు ఓటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ.50 లక్షల లక్షల లంచం ఇస్తూ అడ్డంగా ఏసీబీకి దొరికిపోయిన రేవంత్ రెడ్డికి నిన్న ఏసీబీ కోర్ట్ 12 గంటల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డి నిశ్చితార్థం దృష్ట్యా ఏసీబీ కోర్టు పరిమితులతో కూడిన 12 గంటల బెయిల్‌ను మంజూరు చేసింది. తాజాగా ఏసీబీ కోర్టు ఈ కేసులో కొన్ని షాకింగ్ నిజాలను కూడా వెల్లడించింది. ఈరోజు ఏసీబీ కోర్ట్ రేవంత్ రెడ్డికి పూర్తి బెయిల్‌ను తిరస్కరించడానికి కల కారణాలను చెప్పింది. రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు కు లంచం ఆఫర్ చేశాడని.. ఇందులో భాగంగా తొలుత రూ.50 లక్షలు ఇచ్చినట్టు కూడా కోర్టు తెలిపింది.
మిగిలిన రూ. 4.50 కోట్లను తరువాత ఇస్తామని రేవంత్ చెప్పినట్లుగా వీడియో, ఆడియో టేప్‌లలో రికార్డు అయినట్టు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తెలిపింది. ఈ కేసులో పూర్తిస్థాయిలో ఆడియో, వీడియో రికార్డ్ టేప్‌లను పరిశీలించినట్టు కూడా కోర్టు తెలిపింది. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా ఈ వీడియో ఉందని... ప్రస్తుతం దీనిపై కోర్టులో విచారణ కొనసాగుతోందని కూడా న్యాయస్థానం తెలిపింది. అయితే ఈ టేపుల్లో రేవంత్ దోషిగా స్పష్టంగా తేలడంతో ఎట్టి పరిస్థితుల్లోను ఆయన శిక్ష తప్పదని ఏసీబీ ఉన్నతాధికారులు చెప్పడంతో ఈ బిగ్ షాకింగ్ న్యూస్ టీడీపీ శ్రేణుల్లో ఆందోళనకు గురి చేస్తోంది.