కమల కురువృద్ధుడి జోస్యం: మరోసారి ఎమర్జెన్సీ తప్పదా?

June 18, 2015 | 12:24 PM | 1 Views
ప్రింట్ కామెంట్
advani_says_chances_for_emergency_in_BJP_regime_niharonline

ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో భారతీయ జనతా పార్టీ పాలన ఓవైపు కొనసాగుతున్న వేళ ఆ పార్టీ సీనియర్ నేత ఎల్.కే.అద్వానీ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. భవిష్యత్తులో ఎమర్జెన్సీ తరహా వాతావరణం ఇండియాలో ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని ఆయన అంచనా వేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తో ఆయనకు సంబంధాలు దెబ్బతిన్నాయన్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. దేశంలో ఎమర్జెన్సీ విధించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అద్వానీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వ్యవస్థ ఇంకా రాలేదని, అయితే భవిష్యత్తులో కూడా రాబోదని తాను చెప్పలేకపోతున్నాను అని ఆయన అన్నారు. ఇండియాలో పౌర స్వేచ్ఛకు భంగం కలగబోదన్న నమ్మకం తనకు కలిగేలా పాలన జరగటం లేదని ఆయన అన్నారు. అయితే, అత్యవసర పరిస్థితి రావటం, ఎమర్జెన్సీ విధింపు అంత సులవేం కాదని కూడా అద్వానీ అభిప్రాయపడ్డారు. మొత్తం మీద అద్వానీ కి మోదీ (పాలన)పై ఏమంత సానుకూలత లేదన్న విషయం ఈ కామెంట్ల ద్వారా మరోసారి స్పష్టమయ్యింది. దీనిపై కమలనాథుల రియాక్షన్ ఏంటో వేచి చూద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ