ఓటుకు నోటు కేసులో టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఆయన అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబ సభ్యులకు ఏసీబీ అధికారులు ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. వేం నరేందర్ రెడ్డిని సిట్ కార్యాలయానికి తరలించే అవకాశముంది. ఏసీబీ కోర్టులో ఆయన్ను ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. మంగళవారం రాత్రి నరేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన ఏసీబీ అధికారులు ఉదయం 11 గంటల నుంచి ఆయన్ను ప్రశ్నించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేశారు. నరేందర్ రెడ్డిని గెలుపు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపులు ఇస్తూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఓటుకు నోటు కేసులో భాగంగా నరేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మరోవైపు ఆయన బీపీ, షుగర్ తో బాధపడుతుండటంతో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.