వన్ మ్యాన్ షో అస్సలు వద్దంటున్న అద్వానీ

June 20, 2015 | 12:49 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Advani_warn_modi_indirectly_niharonline

భారత్ లో మళ్లీ అత్యవసర పరిస్థితి రావొచ్చంటూ బీజేపీ ప్రభుత్వం పై బాంబ్ వేసిన ఆ పార్టీ కురు వృద్ధుడు ఎల్ కే ఆద్వానీ ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు ఏ ఒక్కరినో ఉద్దేశించి చేసినవి కావని ఆయన చెప్పుకొచ్చారు. అయితే రాజకీయ పార్టీల్లో వన్ మ్యాన్ షో కు తాను వ్యతిరేకమని చెప్పారు. గతంలో అటల్ బీహారీ వాజ్ పేయి అందరినీ కలుపుకుని పోయే వారని, ప్రస్తుత నేతలు కూడా ఆయనంత సచ్ఛీలురుగా ఉండాలని అద్వానీ కోరారు. ‘నేను చేసిన ప్రకటన ఏ ఒక్కరి పైనా కాదు. అన్ని రకాల నిరంకుశత్వాలకు మాత్రమే నేను వ్యతిరేకం’ అని ఓ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో అద్వానీ చెప్పారు. అహంకారం నిరంకుశత్వానికి మూలమని, అది చాలా బాధాకరమని అన్నారు. ప్రస్తుత రాజకీయ నేతలు వాజ్ పేయిలా నిగర్విలా ఉండాలని పిలుపునిచ్చారు. కానీ మిగిలిన కమల కురు వృద్ధులు మాత్రం అద్వానీ మాటలను సీరియస్ గా తీసుకోవాలంటున్నారు. ‘వన్ మ్యాన్ షో’ అని అద్వానీ చేసిన సంబోధనలు ఎవరినీ ఉద్దేశించి అన్నవో అర్థం చేసుకోవాలని సీనియర్ నేతలు చెబుతున్నారు. ఈ మాటలు ఎవరికి అర్థంకావాలో, ఎవరిని సూటిగా తాకాలో వారినే తాకుతాయని వారు చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ