కేసీఆర్ సీన్ రివర్స్ ఎలా అయ్యిందంటే...

October 05, 2015 | 03:50 PM | 2 Views
ప్రింట్ కామెంట్
oppositions-fire-on-CM-KCR-in-Assembly

అధికారంలో ఉన్నాం... తిరుగే లేదనుకున్న గులాబీ దళపతి కేసీఆర్ కి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. మొన్నటిదాకా ఏపీలో నడిచిన వ్యతిరేక పాలనా పవనాలు ఇప్పుడు ఇక్కడ వీస్తున్నట్లు అనిపిస్తోంది. ఏడాదిన్నర సమావేశాల్లో దూకుడు ప్రదర్శించిన అధికార పక్షానికి ప్రస్తుతం ఆత్మరక్షణలో పడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వారం క్రితం దాకా ఎదురులేదనుకున్న టీఆర్ ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. బుధవారం దాకా రైతు ఆత్మహత్యలతో కాలం గడుపుదామనుకున్న ప్రభుత్వానికి తాను తీసుకున్న గోతిలో తానే పడిన చందాన ప్రస్తుత పరిస్థితి తయారయ్యింది. అసలు ఈ అంశంపై చర్చకు తానే తెర తీసిన ప్రభుత్వం సభలోని అన్ని పక్షాలపైనా పైచేయి సాధించింది అనుకుంటున్న సమయంలో సీన్ రివర్స్ అయ్యింది.

                 ఎలాగైనా అధికార పక్షం తాట తీయ్యాలన్న ఉద్ధేశంతో విభేదాలను పక్కనబెట్టి మరీ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైసీపీ ఒక్కటయ్యాయి. సర్కారుపై దండయాత్ర చేశాయి. వీటికి మజ్లిస్ లాంటి మద్దతు పార్టీలు కూడా తోడవ్వటం విశేషం. దీంతో వారం క్రితం దాకా ఎదురే లేకుండా సాగిన ప్రభుత్వం సాయంత్రమయ్యే సరికి సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా పరిస్థితి చేయి దాటిపోవడానికి గల కారణమేమిటని సాక్షాత్తు సీఎం కేసీఆర్ మంత్రులను, పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలను నిలదీశారు. చివరికి సోమవారం కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది.

                తమను ఆత్మరక్షణలో పడేసిన వ్యూహానికి కర్త, కర్మ, క్రియ అన్నింటికీ కారణం ఎవరో తెలిసి కూడా ఏం చెయ్యలేని స్థితిలో టీఆర్ఎస్ ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి దీని కోసం ఏదైనా ప్రత్యేక వ్యూహం ఉందేమో చూడాలి. ఏదేమైనా ఎదురే లేదని జబ్బలు చరుచుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈ పరిణామాలు మింగుడు పడని పరిస్థితే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ