బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీ, ఆర్జేడీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంటోంది. సూటి పోటీ మాటలతో ఇరు పార్టీలు మాటల తూటాలు విసురుకుంటున్నాయి. అయితే ఇది శృతి ముంచితేనే ప్రమాదం. ప్రస్తుతం ఇప్పుడు అదే జరుగుతుంది. ముఖ్యంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను అమిత్ షా 'జంగిల్ రాజ్' అని వ్యాఖ్యానించగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను లాలూ 'నరభక్షి' అన్నారు. బీహార్ లో లాలూ జంగిల్ రాజ్యాన్ని తీసుకురావాలని భావించారని, బీజేపీ చొరవతోనే ఆయన పదవి నుంచి కిందకి దిగాల్సి వచ్చిందని ఆపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బీహార్ లో మత కల్లోలాలు రేపి ప్రజల మధ్య చిచ్చుపెట్టిన అమిత్ షా బీహార్ ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు వచ్చాడని లాలూ విమర్శిస్తున్నారు. లాలూ విమర్శలను తిప్పికొట్టేందుకు అరుణ్ జైట్లీ రంగంలోకి దిగారు. గోద్రా రైలు ప్రమాదంపై రైల్వే మంత్రిగా ఉన్న లాలూ తప్పుడు నివేదిక ఇచ్చాడని, సమాజాన్ని విడదీసి జంగిల్ రాజ్ లా చేయడానికి లాలూ ప్రయత్నిస్తున్నాడని ఆయన విమర్శించారు.