నిజంగానే బాబు వారిని లైట్ తీసుకుంటున్నాడా?

March 17, 2015 | 01:07 PM | 52 Views
ప్రింట్ కామెంట్
anganvadi_issue_in_Assembly_niharonline

అంగన్ వాడీ కార్యకర్తల సమస్యలపై ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అట్టుడుకిపోతోంది. పోలీసుల కన్నుగప్పి హైదరాబాద్ ఇందిరాపార్క్ కు చేరుకున్న అంగన్ వాడీ కార్యకర్తలు ఆందోళనకు సిద్ధమయిన సంగతి తెలిసిందే. వారి సమస్యలపై చర్చకు అసెంబ్లీలో ప్రతిపక్ష వైసీపీ పట్టుపట్టింది.  దీనిపై అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ... హైదరాబాద్ లో బందోబస్తు మా బాధ్యత కాదు... వారిపై దాడులు జరిగితే మాకు సంబంధం లేదు అన్న రీతిలో మాట్లాడారు. ఆ వ్యాఖ్యలతో విపక్షాలు ఒక్కసారిగా ఊగిపోయాయి. దీంతో సభ కాసేపు వాయిదాపడింది. ఇక మీడియా పాయింట్ వద్ద వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడింది. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో అంగన్ వాడీలకు జీతం తక్కువగా ఉందని ఆమె అన్నారు. అంగన్ వాడీల బాధలను వారు(పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు) అర్థం చేసుకుంటున్నారని, కానీ, మన ముఖ్యమంత్రి(చంద్రబాబునాయుడిని ఉద్ధేశించి) అర్థం కావటం లేదని ఆమె మండిపడ్డారు. తమ బాధలను సీఎంకు చెప్పుకుందామని వచ్చిన అంగన్ వాడీలను పోలీసులు లాక్కొని పోవటం దారుణమన్నారు. చంద్రబాబు నిరంకుశ పాలనకు ఇది అద్ధం పడుతోందని చెప్పారు. అంగన్ వాడీల తరపున పోరాడేందుకు కలిసిరావాలని ఆమె మిగతా పార్టీలకు పిలుపునిచ్చారు. ఈ వ్యవహారమంతా చూస్తుంటే చంద్రబాబు అంగన్ వాడీ కార్యకర్తల ఆందోళనను లైట్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ