అన్నా అంటే అంతమంటెందుకట?

February 27, 2015 | 05:51 PM | 56 Views
ప్రింట్ కామెంట్
hazare_fire_modi_niharonline

ప్రధాని మోదీకి సామాజిక కార్యకర్త, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే అంటే ఎక్కడో కాలుద్దట. ఈ విషయాన్ని హజారేనే స్వయంగా తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర గ్రామంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... భూసేకరణ బిల్లుపై తానిచ్చే సలహాలను ప్రధాని అంగీకరించరని చెప్పారు. ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న నేనంటేనే ఆయనకు మండుద్దని పేర్కొన్నారు. బలవంతపు భూసేకరణకే ప్రభుత్వాలు మొగ్గుచూపుతాయని ఆయన అన్నారు. అందుకే ఈ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మోదీ, రాహుల్ గాంధీల నెత్తిన పారిశ్రామిక వేత్తలు తిష్టవేసుకుని కూర్చుకున్నారని, మోదీ దేశ ప్రజలకు న్యాయం చేయలేరని తాను ఎన్నికలప్పుడే హెచ్చరించానని గుర్తుచేశారు. భూసేకరణకు వ్యతిరేకంగా ప్రతిగ్రామాన 8 మందితో ఓ కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసుకుని ఉదృతం చేస్తామని ఆయన ప్రకటించారు. అయినా పెద్దాయన చేసే పనిని చల్లగా చేసుకుంటూ పోతుంటే మండదా మరీ!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ