ఆప్ అన్నా హస్తం?

January 29, 2015 | 10:33 AM | 27 Views
ప్రింట్ కామెంట్

ఢిల్లీ ఎన్నికల్లో బరిలో దిగిన ఇద్దరు అభ్యర్థులు ఆయన శిష్యులే. ఉద్యమపరంగానే కాదు, వ్యక్తిగతంగా కూడా ఇద్దరితో ఆయనకు అవినాభావా సంబంధం ఉంది. మరి ఆయన మద్ధతు ఎవరికీ అన్నదే ప్రశ్న. అవినీతి ఉద్యమకారుడు, ప్రముఖ గాంధేయవాది అన్నాహజారే మనోగతంపై ఇప్పుడు నడుస్తున్న చర్చ ఇదే. అయితే ఎవరికీ మద్ధతు ఇచ్చే అంశంపై ఆయన నోరు విప్పారు. తన మద్ధుత ఎవరికీ ఉండబోదని ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తేల్చి చెప్పాడు. బేడీ, కేజ్రీవాల్‌లపై తనకు ఎలాంటి కోపం లేదని.. వారి నుంచి ఏదీ ఆశించనప్పుడు కోపమెందుకు వస్తుందని ఆయన చెప్పారు. ఢిల్లీ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారన్న దానిపై తనకు ఆసక్తి లేదన్నారు. పార్టీ రాజకీయాల ద్వారా ఎవరూ ఎలాంటి మార్పూ తీసుకురాలేరన్నారు. తనను ఆ గొడవల్లోకి లాగవద్దని చెప్పారు. అయితే ఎవరికీ ఇచ్చేది లేదంటూనే ఆయన పరోక్షంగా ఆప్ కు మద్ధతు అంటూ హింటిచ్చాడు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురావటంలో మోదీ సర్కారు పూర్తిగా విఫలమైందని, లోక్ పాల్ విషయంలో కూడా మోసం చేసిందని అన్నా హజారే తీవ్రంగా విమర్శించారు. అంటే ఇండైరక్ట్ గా ఆయన బీజేపీ కి తన మద్ధతు లేదనే ప్రకటించేశారు. అంటే కిరణ్ బేడీకి ఇవ్వనని చెప్పేశారన్న మాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ