కొత్త మద్యం పాలసీకి కసరత్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలకు తెరతీస్తోంది. మద్యం దుకాణదారుల రింగ్ తో మద్యం ధరలు నిర్దేశిత రేట్ల కన్నా అధికంగా ఉంటున్నాయి. పల్లెలు, పట్టణాలన్న తేడా లేకుండా అన్ని చోట్లా ఇదే దందా. ఈ అక్రమ దందాకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ మద్యం దుకాణాలతోపాటు సర్కారీ మద్యం దుకాణలుంటే ఈ దందాకు చెక్ పెట్టొచ్చని భావిస్తుందట. అనుకున్నదే తడవుగా ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ తరహా వినూత్న నిర్ణయాలతో త్వరలోనే ఏపీ నూతన మద్య పాలసీ విడుదల కానుంది. ఈ మేరకు ప్రతి మండలంలో ఓ సర్కారీ మద్యం దుకాణం ఏర్పాటుచేయనున్నారట. తద్వారా అక్కడ ఉన్న మిగతా ప్రైవేట్ మద్యం దుకాణదారులు తప్పనిసరిగా నిర్దేశిత ధరలకే మద్యం విక్రయించాల్సి ఉంటుంది. పాత మద్యం పాలసీకి ఈ నెల చివరి నాటికి కాలం చెల్లిపోతుంది. తదుపరి నూతన మద్యం పాలసీ జూలై 1 నుంచి అమలులోకి రానుంది. అనుకున్నట్లు జరిగితే సర్కాయి దుకాణాలు దర్శనమిస్తాయన్నమాట.