చల్లారిందనుకున్న సెక్షన్ 8 ని నేతలు మళ్లీ కెలుకుతున్నారు. ఉమ్మడి రాజధానిలో అమలు చెయ్యాలంటూ ఏపీ కేబినెట్ మంత్రులు నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. విభజన తర్వాత పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లో ఏడాది గడవక ముందే తెలంగాణ సర్కార్ సీమాంధ్రుల హక్కులను కాలరాస్తోందని ఈ సందర్భంగా ఏపీ మంత్రులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. సాక్షాత్తూ తమ అధినేత, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు సెల్ ఫోన్ సహా 120 మందికి చెందిన ఫోన్లను నిబంధనలకు విరుద్ధంగా టీ సర్కార్ ట్యాప్ చేసిందని కూడా వారు ప్రణబ్ కు తెలపనున్నారు. సెక్షన్ 8 తోనే హైదరాబాద్ లో సీమాంధ్రులు నిర్భయంగా జీవనం కొనసాగించగలరని కూడా డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి నేతృత్వంలో మంత్రుల బృందం రాష్ట్రపతిని కలవనుంది. అక్కడి నుంచైనా ఏమన్నా సానుకూల స్పందన రావొచ్చేమో వారి ఎదురుచూస్తున్నారట.