రేవంతుడు బుద్ధిమంతుడు!

July 14, 2015 | 04:40 PM | 11 Views
ప్రింట్ కామెంట్
revanth_reddy_not_attending_court_niharonline

పెద్దలమాట చద్దిమూట! ఎవరైనా పెద్దలు సంభాషణ సరసంగా లేనప్పుడు ‘నోర్ముయ్యవోయీ’ అనగానే, అన్న పెద్దాయన నోరు మూసే యత్నం చేయడం, మాట వరసకు ‘ఏడిశావులే’ అనగానే ఏడుపు లంకించుకోవడం, నీ మొఖం చూపించకు అనగానే మాస్కు తగిలించుకుని వచ్చి ఇకిలించడం... వీటన్నింటినీ ఏమంటారు? అతితెలివంటారా లేదా? అతితెలివి ప్రదర్శించిన కోణంగిని చూస్తే పెద్దలకి కుర్తాలో సిగరెట్టు పీక వేసినట్టు ఫీలింగు వచ్చేసి గాంధీ తాత చేతిలో కర్ర లాక్కుని ఒక్కటి పీకాలనిపిస్తది. ఈ డొంక తిరుగుడు అంతా దేనికంటారా? ఏ-వన్ గా ఖ్యాతి గడించిన చిరంజీవి సుబుద్ధి రేవంతు బాబుని మహరాజశ్రీ కోర్టు వారు నిన్న సోమవారం విచారణ నిమిత్తం ఏసీబీ కోర్టుకి దయ చేయమని ఆహ్వానించేరు. శ్రీవారితోబాటు సెబాస్టియన్, ఉదయ సింహుల వారికికూడా తాఖీదులిచ్చేరు. వీరిరువురునూ కోర్టు ఆదేశాల్ని మన్నించేరు. రేవంతుడు హాజరుకాలేదు. ఏవిటయ్యా భేతాళా కారణం అని తర్కించిన మీదట... కోర్టు ఆదేశాల మేరకు తన నియోజకవర్గం దాటి బయటకు వెళ్లరాదని చెప్పేవారని, సదరు నిబంధనలను తూచా పాటించవలసిన బాధ్యత తనపై ఉన్నది కావున, నియోజకవర్గం వెలుపల ఉన్నటువంటి కోర్టుకు రాలేకపోయాడని కోర్టువారికి తెలియజేయడం జరిగింది. ఎంత వినయం! ఎంత నిజాయితీ! కోర్టంటే ఎంత గౌరవం! న్యాయమూర్తి గారికి బాగా కాలి ఉంటుంది. అతితెలివికి పోవడం ఫలానా తారీఖున వచ్చి కనబడమని సౌమ్యంగానే కబురంపేరని తెలిసింది!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ